అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'లవ్ స్టోరీ'. ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నాడు. 'ఫిదా' లాంటి సెన్సేషనల్ హిట్ సినిమా తర్వాత దాదాపు రెండేళ్ల గ్యాప్ తీసుకుని శేఖర్ కమ్ముల తీస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.ఎలాగైనా ఈ చిత్రాన్ని సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని శేఖర్ కమ్ముల భావిస్తున్నాడట. అందుకోసమే కరోనాను కూడా పట్టించుకోకుండా ఆయన తన సినిమా షూటింగ్ ను కానిచ్చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ మహబూబ్ నగర్ లో జరుగుతుండగా నాగ చైతన్య.. సాయి పల్లవిలపై చిత్రీకరణను కొనసాగిస్తున్నారు. అయితే కరోనా నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకునే షూటింగ్ చేస్తున్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa