ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరోసారి మారుతి తో నాని..

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 23, 2020, 12:30 PM

నాని కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో వచ్చిన 'భలే భలే మగాడివోయ్' చిత్రం భారీ విజయాన్ని సాధించింది. నాని కెరియర్లోనే ఈ సినిమా ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకుంది. అప్పటి నుంచి కూడా ఈ కాంబినేషన్లో మరో సినిమా ఎప్పుడు సెట్ అవుతుందా? అని అంతా ఎదురుచూస్తున్నారు. ఆ సమయం దగ్గరలోనే ఉందనేది తాజా సమాచారం.


నానీ కోసం మారుతి ఒక కథను సిద్ధం చేసి వినిపించడం, ఆ కథను గురించి ఇద్దరు చర్చలు జరపడం చేస్తున్నారట. కథ పూర్తి రూపాన్ని సంతరించుకునే దిశగా ఈ చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. త్వరలోనే కథను లాక్ చేయనున్నట్టు తెలుస్తోంది. నాని నుంచి త్వరలో 'వి' సినిమా రానుండగా, 'టక్ జగదీశ్' చిత్రం సెట్స్ పై వుంది. ఆ తరువాత నాని సినిమా మారుతి దర్శకత్వంలోనే ఉంటుందని చెబుతున్నారు. ఈ ఇద్దరికి కలిసి మరో హిట్ కొడతారేమో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa