సైరా సినిమా తర్వాత దర్శకుడు సురేందర్ రెడ్డి తన మరుసటి సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే కథ సిద్ధం చేసుకొని ఈ సినిమా కోసం హీరోని వెతకడం మొదలెట్టేసాడట. ఇందులో భాగంగానే బన్నీని కూడా సంప్రదించాడట సురేందర్ రెడ్డి. గతంలో వీరిరువురి కాంబినేషన్ లో వచ్చిన రేసుగుర్రం సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ కాంబినేషన్ కోసం ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం బన్నీ, సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa