ఇటు దర్శకుడిగా .. అటు కథానాయకుడిగా కొంత కాలంగా లారెన్స్ తన దూకుడు తగ్గించాడు. తాజాగా ఆయన ఓ తమిళ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. 'అయ్యప్పనుం కోశియుం' అనే మలయాళ సినిమాకి ఇది రీమేక్. మలయాళంలో సాచి దర్శకత్వంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన 'అయ్యప్పనుం కోశియుం' సినిమా అక్కడ భారీ విజయాన్ని సాధించింది.పృథ్వీరాజ్ సుకుమారన్ .. బిజూ మీనన్ నటించిన ఈ సినిమాను, తమిళంలో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో లారెన్స్ కథానాయకుడిగా నటిస్తుండగా, ఆయన జోడీగా ప్రియా భవానీని ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమాకి లారెన్స్ దర్శకత్వం వహిస్తాడా? లేదా? అనే విషయంలో క్లారిటీ రావలసి వుంది. 'అయ్యప్పనుం కోశియుం' సినిమాను తెలుగులోను రీమేక్ చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. రానా - వెంకటేశ్ కాంబినేషన్ ఈ కథకి కరెక్ట్ గా సెట్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa