ఈ రోజు రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఆయనకు జూనియర్ ఎన్టీఆర్ ఓ బహుమతి పంపాలనుకున్నాడు. కానీ అది మాత్రం రాజమౌళికి పంపాడట. ఈ విషయాన్ని స్వయంగా రామ్ చరణ్‌కు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు ఎన్టీఆర్. ఇక జక్కన్న దగ్గరకి వెళితే.. ఆ బహుమతి ఎంత లేట్ అవుతుందన్న అర్ధంలో ఎన్టీఆర్ ఆ పోస్ట్ చేసాడు. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఒక రాజమౌళి తన సినిమాను అమర శిల్పి జక్కన్న ఉలితో ఓ శిల్పాన్ని చెక్కినట్టు సినిమాలకు చెక్కుతాడని ఎన్టీఆర్.. రాజమౌళికి జక్కన్న అనే పేరు పెట్టిన సంగతి తెలిసిందే కదా. ఈ రోజు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రాజమౌళి రామ్ చరణ్‌కు సంబంధించిన ఏదైనా వీడియోను రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. ఆర్ఆర్ఆర్ విషయానికొస్తే.. ఈ సినిమాకు ‘రౌద్రం రణం రుధిరం’ అనే టైటిల్ కన్ఫామ్ చేసారు.హిందీ, ఇంగ్లీష్‌లో ‘రైజ్ రోర్ రవోల్ట్’ అనే పేరు పెట్టారు. 1920 నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. బ్రిటిష్ ప్రభుత్వంలపై అప్పటి చారిత్రక యోధులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు కట్టలు తెచ్చుకున్న రౌద్రంతో వీళ్లిద్దరు కలిసి చేయాలనుకున్న రణం. ఆ యుద్ధంలో ఈ యోధులు అర్పించిన రుధిరం. అంటే రక్తం చిందించడం అనే అర్ధంతో ఈ సినిమాకు ‘రౌద్రం రణం రుధిరం’ టైటిల్ పెట్టారు. మొత్తానికి రాజమౌళి నుంచి ఈ వస్తోన్న ఈచిత్రం వచ్చే యేడాది సంక్రాంతి కానుంగా జనవరి 8న విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa