ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్బంగా 'ఆర్ ఆర్ ఆర్' నుంచి వీడియో?

cinema |  Suryaa Desk  | Published : Sun, Mar 29, 2020, 11:59 AM

రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్' సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి 'రౌద్రం రణం రుధిరం' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఎన్టీఆర్ - చరణ్ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్న ఈ సినిమాపైనే అందరి దృష్టి వుంది. ఈ నేపథ్యంలో చరణ్ పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకుని, ఇటీవల ఆయన పాత్రను పరిచయం చేస్తూ ఒక వీడియోను విడుదల చేశారు.రామరాజుగా చరణ్ ను చూపిస్తూ .. ఆ పాత్ర ఎంత పవర్ఫుల్ గా వుంటుందనేది ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో చెప్పిస్తూ వదిలిన ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ వీడియోతో చరణ్ అభిమానులంతా ఫుల్ ఖుషీ అయ్యారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను పరిచయం చేస్తూ మే 20వ తేదీన ఓ వీడియోను విడుదల చేయనున్నట్టుగా చెబుతున్నారు. ఆ రోజున ఎన్టీఆర్ పుట్టినరోజు. అందువలన కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ను చూపిస్తూ ఓ వీడియోను వదలనున్నట్టుగా చెప్పుకుంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa