డీటీహెచ్, కేబుల్ నెట్‌వర్క్ వినియోగదారులకు ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ ఫౌండేషన్ (ఐబీఎఫ్) శుభవార్త చెప్పింది. సోనీపాల్, స్టార్ ఉత్సవ్, వయాకామ్ 18, కలర్స్ రిలేషన్‌షిప్ చానళ్ల అన్ని రుసుములను రెండు నెలలపాటు మాఫీ చేయాలని నిర్ణయించినట్టు ఐబీఎఫ్ తెలిపింది. ఈ చానళ్లు రెండు నెలలపాటు ఉచితంగా అందుబాటులో ఉంటాయని పేర్కొంది. డీటీహెచ్, కేబుల్ నెట్‌వర్క్‌లకు ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. కాగా, కరోనా వైరస్ కారణంగా టీవీ పరిశ్రమ దారుణ పరిస్థితి ఎదుర్కొంటోందని, ప్రకటనల ఆదాయం గణనీయంగా పడిపోయిందని ఐబీఎఫ్ తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa