ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'రంగస్థలం'కి రెండేళ్లు

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 30, 2020, 02:43 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నట విశ్వరూపాన్ని వెండితెరకు పరిచయం చేసిన సినిమా 'రంగస్థలం'. హావభావాలను పండించడం రాదని రామ్ చరణ్ ను కామెంట్ చేసిన వారికి రామ్ చరణ్ ఏంటో తెలిసేలా చేసిన సినిమా రంగస్థలం. ఈ సినిమా విడుదలై నేటికీ సరిగా రెండేళ్లు అవుతుంది.1980ల నేపథ్యంలో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కథానాయికగా సమంత నటించగా.. ఆది పినిశెట్టి, జగపతిబాబు, ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రలను పోషించారు. ఈ సినిమా నేరుగా 15 సెంటర్లలో 100 రోజులు ప్రదర్శించబడి చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రానికి దేవీశ్రీ అందించిన సంగీతం 2018 లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa