ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చరణ్ ఎంతో నేర్చుకున్నాడు : రాజమౌళి

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 31, 2020, 08:16 AM

దాదాపు 10 ఏళ్ల తర్వాత మళ్ళీ జక్కన్న - రామ్ చరణ్ కాంబినేషన్ లో సినిమా వస్తుంది. 'మగధీర' లాంటి భారీ హిట్ తర్వాత వీరిరువురు కలిసి సినిమా చేయలేదు. దీంతో ఈ సినిమాపై భారీ అంచానాలు ఉన్నాయి. కాగా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా 'భీమ్ ఫర్ రామరాజు' పేరుతో చరణ్ పోషిస్తున్న అల్లూరి సీతారామరాజు పాత్రను పరిచయం చేస్తూ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోకు అన్ని భాషల్లో విశేష స్పందన లభించింది. చరణ్ గెటప్, బాడీ లాంగ్వేజ్ అందరినీ ఇంప్రెస్ చేశాయి. చరణ్ ను ఎంతో పవర్ ఫుల్ గా చూపించినందుకు జక్కన్నకు ఫ్యాన్స్ ధన్యవాదాలు తెలుపుతున్నారు. చరణ్ పెర్ఫార్మెన్స్ గురించి రాజమౌళి మాట్లాడుతూ.. పదేళ్ల క్రితం మగధీర సినిమా చేసేటప్పుడు చరణ్ లో ఒక రఫ్ నెస్, రానెస్ కనపడేదది. కానీ ఇప్పుడు చరణ్ లో అవేమీ లేవు. చరణ్ నటుడిగా ఎన్నో మెట్లు ఎక్కాడు... ఎంతో నేర్చుకున్నాడు. అంతేకాక నటనను ఎంజాయ్ చేస్తున్నాడు అంటూ కితాబిచ్చారు. దీంతో చెర్రీ ఫాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa