ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయ్ సేతుపతి 'ఉప్పెన" లుక్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 01, 2020, 12:06 PM

వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో 'ఉప్పెన' రూపొందింది. ఈ నెల 2వ తేదీన విడుదల కావలసిన ఈ సినిమా వాయిదా పడింది. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఈ సినిమాలో కథానాయికగా కృతి శెట్టి అలరించనుంది. ఆమె తండ్రిగా .. ప్రతినాయకుడిగా 'రాయనం' పాత్రలో విజయ్ సేతుపతి నటించాడు. ఆయన పాత్ర ఈ సినిమాకి హైలైట్ కానుందని అంటున్నారు.


తాజాగా ఈ సినిమా నుంచి విజయ్ సేతుపతి లుక్ ను రిలీజ్ చేశారు. కాలు మీద కాలేసుకుని విజయ్ సేతుపతి సిగరెట్ తాగుతున్న ఈ స్టిల్ ఆకట్టుకుంటోంది. ఈ స్టిల్ ను బట్టే ఈ సినిమాలో ఆయన పాత్ర స్వభావాన్ని అంచనా వేయవచ్చు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు. ఈ ప్రేమకథా చిత్రం మ్యూజికల్ హిట్ గా నిలవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa