ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనసూయను ఆటపట్టించిన మంచు విష్ణు

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 29, 2018, 12:56 PM

మోహన్‌బాబు, మంచు విష్ణు నటించిన గాయత్రి సినిమా ఆడియో ఫంక్షన్‌ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సినిమాలో యాంకర్ అనసూయ జర్నలిస్ట్‌గా నటిస్తోంది. ఈ సందర్భంగా ఆడియో ఫంక్షన్‌లో అనసూయ మాట్లాడుతుండగా ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. మంచు కుటుంబానికి తాను ఆస్థాన యాంకర్‌నని చెప్పుకున్న అనసూయ.. మిస్టర్ నూకయ్య ఆడియో ఫంక్షన్ సమయానికి తాను చిన్న పిల్లనని చెప్పింది. అయితే ఆ మాటలు విన్న మంచు విష్ణు అనసూయను టీజ్ చేశాడు. ‘‘మనోజ్ సినిమా టైంకు నువ్వు చిన్నపిల్లవా’’ అని అనసూయను విష్ణు ఆటపట్టించాడు. ‘‘ఇలాంటివి బాగా పట్టుకుంటారని’’ విష్ణును ఉద్దేశించి అనసూయ వ్యాఖ్యానించింది. మిస్టర్ నూకయ్య సినిమా ఆడియో ఫంక్షన్ చేసే సమయానికి యాంకరింగ్‌లోకి కొత్తగా వచ్చానని, అందుకే ప్రొఫెషన్‌లో చిన్న పిల్లనన్న ఉద్దేశంతో మాట్లాడానని అనసూయ చెప్పింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa