ఆలియా భట్.. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమాతో బాలీవుడ్ కి పరిచయమైన హాట్ బ్యూటీ. డైరెక్టర్ మహేష్ భట్ వారసత్వంగా సినిమాల్లోకి వచ్చిన అలియా మొదటి సినిమాతోనే అందంతో పాటు అభినయం కూడా తన సొంతమని నిరూపించుకుంది. ఆ తర్వాత వచ్చిన 'డియర్ జిందగీ - 'హైవే' - 'రాజీ' - హంప్టీ శర్మా కీ దుల్హనియా - బద్రీనాథ్ కీ దుల్హనియా - 2 స్టేట్స్ - అగ్లీ - వెల్కమ్ టూ న్యూయార్క్ - జీరో - కళంక్ మొదలగు సినిమాలు ఆమెకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. 'ఉడ్తా పంజాబ్' - 'గల్లిబాయ్' చిత్రాల ద్వారా ఎన్నో అవార్డులను కూడా దక్కించుకుంది. అంతేకాకుండా ఈ భామ ప్రస్తుతం తెలుగులో దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న 'రౌద్రం రణం రుధిరం' (ఆర్.ఆర్.ఆర్) చిత్రంలో కూడా నటిస్తోంది. ఈ సినిమాతో మన తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించబోతోంది. ఆ సినిమాతో పాటు ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వస్తోన్న 'గంగూబాయ్' సినిమాలో లీడ్ రోల్ చేస్తోంది. అమితాబ్ - నాగార్జున - రణబీర్ కపూర్ కలిసి నటిస్తున్న 'బ్రహ్మాస్త్ర' సినిమాలో ప్రధాన పాత్ర చేస్తున్నది. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలుగు సినిమాలో నటిస్తున్నావ్ కదా..తెలుగులో నీకు ఫేవరేట్ యాక్టర్ ఎవరు అని అడగగా దానికి అదిరిపోయే సమాధానం ఇచ్చింది అలియా.తెలుగు హీరోల్లో ప్రభాస్ అంటే చాలా ఇష్టమని ఆలియా భట్ చెప్పిందట. ఈ మధ్య రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలిలో ప్రభాస్ నటన - స్క్రీన్ ప్రెజన్స్ చూశాక ఆయనకు ఫ్యాన్ అయిపోయానని చెప్పుకొచ్చింది. బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్ ఇప్పుడు అలియాకి కూడా ఫేవరేట్ యాక్టర్ గా మారిపోయాడన్న మాట. ఈ తరం టాలీవుడ్ హీరోలను బాలీవుడ్ వాళ్ళు గుర్తించడం బాహుబలి తర్వాతే స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. ఎన్నో సినిమాలు చేసినా రాని స్టార్ డమ్ ప్రభాస్ కేవలం రెండు సినిమాల ద్వారా తెచ్చుకున్నాడని చెప్పవచ్చు. ఇంక 'ఆర్ ఆర్ ఆర్' విషయానికొస్తే ఈ సినిమాలో ఆలియా చరణ్ కి జోడీగా నటిస్తుంది. ఆలియా భట్ త్వరలో ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్లో పాల్గొననుంది. 'ఆర్ ఆర్ ఆర్' షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది. కాగా పూణే షెడ్యూల్ వచ్చే నెల నుండి మొదలుకానుట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో ఆలియా ఆర్ ఆర్ ఆర్ టీమ్ తో కలవనుందని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa