డిజిటల్- ఆన్ లైన్ మాధ్యమాల్లో తారల స్పీడ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. ట్విట్టర్..ఫేస్ బుక్.. ఇన్ స్టా గ్రామ్ వంటి మాధ్యమాల్లో టాప్ స్టార్లకు లక్షలాది ఫాలోవర్స్ ఏర్పడుతున్నారు. అభిమానులు..సినిమా వాళ్లు...ఇంకా వ్యక్తిగతంగా ఇష్టపడే వారు తమ అభిమాన హీరో లేదా నటీనటుల్ని అనుసరిస్తున్నారు. అందుకే ఈ వేదికలపై తమ సినిమాలు .. ఫ్యామిలీ.. ఇతర వ్యక్తిగత విశేషాలు అభిమానులతో పంచుకోవడం మన టాప్ స్టార్లకు వ్యాపకంగా మారింది. ఆయా మాధ్యమాల్లో ఫాలోయింగ్ పెంచుకునేందుకు తారలు రకరకాల టెక్నిక్స్ ని ఫాలో చేస్తుంటారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్విటర్లో ఆ తరహా టెక్నిక్ ని అనుసరించారు. ఇప్పటికిప్పుడు ట్విట్టర్ ఫాలోవర్స్ అమాంతం పెంచేసిన ఆ టెక్నిక్ ఏమిటి? అంటే.. వివరాల్లోకి వెళ్లాల్సిందే.పవన్ ఇతర స్టార్లతో పోలిస్తే చాలా ఆలస్యంగానే వ్యక్తిగతంగా ట్విట్టర్ ఖాతాను తెరిచారు. ఇంతకుముందు జనసేన పార్టీ కార్యకలాపాల కోసం ఒక ఖాతాను రన్ చేసిన సంగతి తెలిసిందే. అది ఇప్పటికీ ట్రెండింగులో ఉంది. ఇక వ్యక్తిగత ఖాతా నలుగురితో మొదలై .. 34 మంది ఫాలోవర్స్ తో స్పీడ్ పెంచుకుని.. ఇప్పుడు ఏకంగా వేలు లక్షలాది మంది అనుసరించే స్థాయికి వచ్చింది. బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్... మెగాస్టార్ చిరంజీవి.. రామ్ చరణ్..మేనల్లుడు సాయిధరమ్ వీళ్లందరితో పోలిస్తే పవన్ ఎప్రోచ్ చాలా డిఫరెంట్. అందుకే జెట్ స్పీడ్ తో తనకు ట్విట్టర్ లో ఫాలోవర్స్ పెరిగారని అర్థమవుతోంది. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ సహా ప్రపంచ వ్యాప్తంగా పవన్ ని అనుసరించే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. బాలీవుడ్ నటుడు..దర్శకుడు శేఖర్ కపూర్ కూడా పవన్ ని ట్విట్టర్ లో అనుసరిస్తున్నారు. అలాగే సంగీత దర్శకుడు ఎస్.ఎస్ థమన్ కూడా ఈ జాబితాలో చేరాడు. జనసేన పార్టీ మొదలు .. పవన్ తో ఎంతో సన్నిహితుడైన థమన్ వకీల్ సాబ్ ఆఫర్ ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇంకా పలువురు మెగా ఫ్యామిలీ మెంబర్లను..పవన్ వ్యక్తిగతంగా ఇష్టపడే వారిని పవర్ స్టార్ ట్విటర్లో అనుసరించడం విశేషం.ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకేసారి నాలుగు సినిమాలకు వెంట వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం జనసేన పార్టీకి నిధిని సమీకరించే ప్రయత్నం చేస్తుండడం ఆసక్తిని పెంచిన సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ తర్వాత కెరీర్ 27వ సినిమా సెట్స్ కెళ్లింది. 28వ 29వ సినిమాలకు ఇప్పటికే జెట్ స్పీడ్ తో ప్రణాళికల్ని సిద్ధం చేశారు. అయితే కరోనా ప్రభావం ఈ ప్రణాళికల్ని పెద్ద దెబ్బ కొట్టింది. అన్ని వినోద పరిశ్రమల్లానే టాలీవుడ్ పైనా దీని ప్రభావం తీవ్రంగా పడడంతో ఇప్పుడు ప్రణాళికల్లో ఎలాంటి మార్పు చేర్పులుంటాయోనన్న ఆందోళన నెలకొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa