ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సాయిపల్లవి కంటే తమన్నా బెటర్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 29, 2018, 02:53 PM

విక్రమ్ హీరోగా నటించిన తమిళ సినిమా ‘స్కెచ్’. ఇందులో తమన్నా హీరోయిన్. యాక్చువల్లీ సినిమా స్టార్టింగులో విక్రమ్ కి జోడీగా సాయిపల్లవిని సెలెక్ట్ చేశారు. ఏమైందో ఏమో… ఆమెను పక్కకు తప్పించి షూటింగ్ మొదలుపెట్టే సమయానికి తమన్నాను తీసుకున్నారు. తెలుగులో ‘ఫిదా’, ‘ఎంసిఎ’ సినిమాలతో సాయిపల్లవికి ఫుల్లు ఫాలోయింగ్ వచ్చింది. ‘స్కెచ్’ను త్వరలో సేమ్ టైటిల్‌తో తెలుగులో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రమోషన్ కార్యక్రమాలకు వచ్చిన విక్రమ్ దగ్గర సాయిపల్లవి ప్రస్తావన వచ్చింది. ఆమె ఎందుకు చేయలేదు? అనే ప్రశ్న ఎదురైంది. కొన్ని కారణాల వల్ల కుదరలేదని విక్రమ్ చెప్పాడు. అంతటితో ఆగకుండా “సాయిపల్లవి కంటే తమన్నా బెటర్ ఛాయస్. చాలా బాగా నటించింది. బ్రాహ్మిణ్ అమ్మాయి పాత్రకు తమన్నా సరిగ్గా సరిపోయింది. సినిమా చూస్తే ప్రేక్షకులకు తెలుస్తుంది” అన్నాడు విక్రమ్. ఏవేవో కారణాల వల్ల నటించలేదని చెప్తే సరిపోయేదేమో. సాయిపల్లవి కంటే తమన్నా బెటర్ ఛాయస్ అనడంతో ‘ఫిదా’ పోరీ ఫ్యాన్స్ షాక్ తిన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa