ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోహన్ లాల్ కు కరోనా అంటూ పుకార్లు....

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 06, 2020, 12:51 AM

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌తో ఇప్పుడు కొందరు ఆకతాయిలు ఇష్టమొచ్చినట్లు చేస్తున్నారు. దాన్ని ప్రముఖులకు అంటించి వాళ్ల ఆరోగ్యం బాగోలేదంటూ ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా మన దేశంలో చూసుకుంటే కేరళలో కరోనా విజృంభన భారీగానే ఉంది. అక్కడ అందరికంటే ముందుగా లాక్ డౌన్ ప్రకటించింది ప్రభుత్వం. ఇదిలా ఉంటే ఇప్పుడు కేరళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కరోనా సోకి చనిపోయాడంటూ కొందరు యువకులు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ చేసారు. ఏ మాత్రం బాధ్యత లేకుండా ఇష్టమొచ్చినట్లు స్టార్ హీరోల గురించి.. సెలబ్రిటీస్ గురించి మితిమీరి ప్రవర్తిస్తున్నారు.ఇది చూసి అభిమానులు కూడా కంగారు పడుతున్నారు. అనవసరంగా ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి అందర్నీ కంగారు పెడుతున్నారు. ఇప్పుడు కేర‌ళ‌లోని ఓ యువకుడు కూడా సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌ లాల్ మనకు ఇంక లేడు అంటూ న్యూస్ వైరల్ చేసాడు. ఈ వార్తను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో మోహ‌న్‌ లాల్ ఫ్యాన్స్ ఆ పోస్ట్‌ను చాలా సీరియస్‌గా తీసుకున్నారు. అంతటితో ఆగకుండా ఆ యువకుడిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు.దాంతో వెంటనే కేరళ పోలీసులు రంగంలోకి దిగారు. ఆ సదరు యువకుడిపై కేసు న‌మోదు చేసి విచార‌ణ చేస్తున్నారు. ఇలాంటి ఆకతాయి పనులు చేస్తే తాట తీస్తామంటూ హెచ్చరిస్తున్నారు పోలీసులు. అయినా కూడా కొందరు హద్దులు మీరుతున్నారు. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మోహన్ లాల్ ఘటనే దీనికి నిదర్శనం. ఇలాంటి వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు అభిమానులు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa