ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ బయోపిక్ రిలీజ్ పరిస్థితి ఏమిటో ?

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 09, 2020, 01:03 PM

లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ లో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ క్రేజీ బయోపిక్ చిత్రాన్ని విష్ణు ఇందూరి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాని తెలుగులో కూడా ఏప్రిల్ 10న విడుదల చేయాలనుకున్నారు. కానీ, కరోనా దెబ్బకు పోస్ట్ ఫోన్ అయింది. కరోనా ప్రభావం తగ్గాక కొత్త రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేయనున్నారు. కాగా ఈ సినిమాని తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో అక్కినేని నాగార్జున విడుదల చేస్తున్నారు. ఇక 83 అనే టైటిల్ తో తెరకెక్కుతుంది ఈ చిత్రం. కపిల్ దేవ్ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు 1983లో వెస్ట్ ఇండీస్ పై ఫైనల్ లో విజయం సాధించి వరల్డ్ కప్ ను ఎలా చేజిక్కించుకున్నారు ? అలాగే కపిల్ జీవితంలో చోటు చేసుకున్న ఆసక్తికరమైన విషయాలు ఏమిటి ? వంటి అంశాలను ఈ సినిమాలో చూపించనున్నారు. అన్నట్టు ఈ చిత్రంలో కపిల్ భార్య పాత్రలో దీపికా పదుకొనె నటిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa