భూమిక చావ్లా... సుమంత్ యువకుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఖుషి, మహేష్ ఒక్కడు, ఎన్టీఆర్ సింహాద్రీ మొదలగు సినిమాలతో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ తర్వాత కొన్ని ఉమెన్ ఓరియెంటెడ్ సబ్జెక్టులలో కూడా నటించి అదరగొట్టింది. భూమికకు మిస్సమ్మ (2003) చిత్రానికి గాను ఉత్తమ నటిగా నంది పురస్కారం లభించింది. అవకాశాలు తగ్గిన భూమిక ఆ తర్వాత పెళ్లి చేసుకుని కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉంది. కాగా ఆ మధ్య భూమిక నాని ఎంసిఎతో రీ ఎంట్రీ ఇచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో భూమిక సమంత ప్రధాన పాత్ర పోషించిన యు టర్న్, అక్కినేని నాగ చైతన్య సవ్యసాచి, తాజాగా బాలయ్య రూలర్ సినిమాతో బిజీగానే గడుపుతోంది. ఈ మధ్య వచ్చిన 'రూలర్' సినిమాలోనూ భూమిక నటించింది. ఆ తరువాత ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా బోయపాటి సినిమాలోను ఆమె నటిస్తోందని సమాచారం. ఈ సినిమాలో భూమిక ఓ కీలకమైన పాత్రలో కనిపించనుందని.. అంతేకాదు ఆమె నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనుందని సమాచారం. ప్రస్తుతం కరోనా వల్ల వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ త్వరలో మళ్లీ మొదలుకానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa