ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మలయాళ హిట్ మూవీ రీమేక్.. సితార వారి చేతికి రీమేక్ హక్కులు

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 13, 2020, 01:19 PM

మలయాళంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన 'అయ్యప్పనుమ్ కోశియుమ్' భారీ విజయాన్ని సాధించింది. పృథ్వీరాజ్ సుకుమారన్ .. బిజూ మీనన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, వైవిధ్యభరితమైనదిగా ప్రశంసలు అందుకుంది. దాంతో ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ను సితార ఎంటర్టైన్మెంట్స్ వారు దక్కించుకున్నారు. ఒక కోటి ఐదు లక్షలకు డీల్ కుదిరినట్టుగా సమాచారం.ఇక హిందీ రీమేక్ రైట్స్ ను కూడా వీరే కొనుగోలు చేసే ఆవకాశం వున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు ఎవరికి  అప్పగించే అవకాశం ఉందనే ప్రశ్నకి సమాధానంగా సుధీర్ వర్మ - గౌతమ్ తిన్ననూరి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరిలో ఒకరు దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది. ప్రధాన పాత్రలకిగాను బాలకృష్ణ - రానా పేర్లు  వినిపిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa