గతేడాది తన తండ్రి జీవితంపై తెరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్ బాలకృష్ణకు చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. ఈ సినిమాలో బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ పాత్రలో అద్భుతమైన అభినయాన్ని కనబరిచారు. క్రిటిక్స్ పరంగా ఓకే అనిపించుకున్న ఈ చిత్రం కమర్షియల్‌గా ఫెల్యూర్‌గా నిలిచింది. ఎన్టీఆర్ కథానాయకుడు,ఎన్టీఆర్ మహానాయకుడు తర్వాత ఇయర్ ఎండ్‌లో చేసిన ‘రూలర్’ కూడా బాలయ్యకు హిట్ ట్రాక్ ఎక్కించలేకపోయింది. ప్రస్తుతం బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమాకు ఓకే చెప్పాడు. బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్లో సినిమా అనగానే యాక్షన్ కి .. ఎమోషన్ కి కొదవుండదనే విషయం అభిమానులకు అర్థమైపోతుంది. 'సింహా' .. 'లెజెండ్' వంటి చిత్రాలు ఈ ఇద్దరి కాంబినేషన్లో కొత్త రికార్డులను నమోదు చేశాయి. హ్యాట్రిక్ హిట్ కొట్టాలనే ఉద్దేశంతో ఈ ఇద్దరూ మరోసారి సెట్స్ పైకి వెళుతున్నారు.ఈ సినిమాలో కథానాయికలుగా శ్రియ - అంజలిని ఎంపిక చేశారు. ఇక ఈ సినిమాలో కీలకమైన పాత్ర ఒకటి ఉందట. ఈ పాత్ర గురించి వింటున్నప్పుడే, ఆ పాత్రను రావు రమేశ్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని బాలకృష్ణ వ్యక్తం చేశారట. బాలకృష్ణ సూచించిన మేరకు రావు రమేశ్ ను సంప్రదించి, ఆ పాత్రకు ఆయనను ఎంపిక చేశారని అంటున్నారు. ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా ఆయన పాత్ర ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమా 'సింహా' .. 'లెజెండ్' పాత్రలను మించిన విజయాన్ని సాధిస్తుందేమో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa