ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరోసారి బుల్లితెరా లో సరిలేరు నీకెవ్వరు మూవీ

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 16, 2020, 05:02 PM

ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న మహమ్మారి. వేగంగా విస్తరిస్తున్న ఈ వైరస్‌కు అడ్డుకట్ట వేయలేక అగ్రరాజ్యాలే గడగడలాడుతున్న వేళ కోవిడ్‌–19 పాజిటివ్‌ కేసు నిర్థారణ అయిన వెనువెంటనే స్పందించి, పటిష్ట చర్యలతో వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేశారు అధికారులు. లాక్‌డౌన్ కారణంగా టీవీ ఛానెల్స్‌కు కూడా ఏం చేయాలో తెలియక వేసిన సినిమాలే మళ్లీ మళ్లీ వేస్తున్నారు. వారం రోజుల గ్యాప్‌లోనే మళ్లీ రిపీట్ చేస్తున్నారు కూడా. జీ తెలుగు, మా టీవీ లాంటి ఛానెల్స్ అయితే తమకున్న అన్ని ఛానెల్స్‌లో ఒకే సినిమాను రెండు రోజుల గ్యాప్‌లోనే మూడు నాలుగు సార్లు రిపీట్ చేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా సీరియల్స్ అన్నీ ఆగిపోయాయి. దాంతో సినిమాలే గతి అయిపోయాయి అందరికీ. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు సినిమాను మరోసారి టెలికాస్ట్ చేయబోతున్నారు జెమినీ యాజమాన్యం. ఉగాది కానుకగా మార్చ్ 25న వచ్చిన సరిలేరు నీకెవ్వరు రికార్డ్ టిఆర్పీ రేటింగ్ తీసుకొచ్చింది.ఏకంగా 23.5 రేటింగ్ తీసుకొచ్చి బాహుబలిని కూడా క్రాస్ చేసింది. ఎంటర్‌టైనర్ కావడంతో తక్కువ గ్యాప్‌లోనే మరోసారి టెలికాస్ట్ చేస్తే రేటింగ్స్ భారీగా వస్తాయని నమ్ముతున్నారు ఛానల్ యాజమాన్యం. పైగా సరిలేరు నీకెవ్వరు కోసం భారీగానే శాటిలైట్ రైట్స్ కూడా పలికాయి. దాంతో ప్రస్తుతం ఉన్న లాక్ డౌన్ పీరియడ్ సద్వినియోగం చేసుకోడానికి నెల రోజుల గ్యాప్‌లోనే మరోసారి సరిలేరు నీకెవ్వరు టెలికాస్ట్ చేయాలని చూస్తున్నారు.అన్నీ కుదిర్తే సెకండ్ టెలికాస్ట్ కోసం ఎప్రిల్ 26ను ముహూర్తంగా పెట్టుకున్నారు జెమిని. సరిగ్గా తొలిసారి టెలికాస్ట్ చేసిన నెల రోజుల తర్వాత రెండోసారి ఈ సినిమాను ప్రదర్శించబోతున్నారు. మరి రెండోసారి సరిలేరు నీకెవ్వరు ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలిక. మహేష్ బాబు కెరీర్‌లో బిగ్గెస్ట్ కమర్షియల్ విజయంగా నిలిచింది సరిలేరు. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా 130 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa