ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యాక్షన్ సీన్స్ తోనే సినిమా మొదలు: మంచు మనోజ్

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 16, 2020, 05:22 PM

టాలీవుడ్ విభిన్న చిత్రాలు తన కంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించాడు మంచు మనోజ్. కాగా.. మంచు మనోజ్ కొంత కాలం విరామం తరవాత ఒక పవర్‌ఫుల్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మనోజ్ కథానాయకుగా 'అహం బ్రహ్మాస్మి' తెరకెక్కుతోంది. సొంతంగా ఎంఎం ఆర్ట్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి 'అహం బ్రహ్మాస్మి'ని తొలి చిత్రంగా నిర్మిస్తున్నట్టు మనోజ్ ప్రకటించారు. మంచు మనోజ్ చాలా గ్యాప్ తరువాత ఒక సినిమా చేయడానికి రంగంలోకి దిగాడు. సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసుకుని, 'అహం బహ్మాస్మి' అనే సినిమాను ప్రకటించాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తవుతుండగానే, కరోనా వైరస్ తన ఎఫెక్ట్  చూపింది. దాంతో రెగ్యులర్ షూటింగు వాయిదా పడింది.జూలై మొదటివారం నుంచి రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టాలనే నిర్ణయానికి మనోజ్ వచ్చాడనేది తాజా సమాచారం. తొలి షెడ్యూల్ మొత్తం హైదరాబాదులోనే ప్లాన్ చేశారట. ఈ షెడ్యూల్ అంతా యాక్షన్ ఎపిసోడ్ నే చిత్రీకరించనున్నారని అంటున్నారు. పీటర్ హెయిన్స్ డిజైన్ చేసిన యాక్షన్ సీన్స్ ను చిత్రీకరిస్తారట. దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి రూపొందిస్తున్న ఈ సినిమాలో మనోజ్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. హీరోగా .. నిర్మాతగా మనోజ్ ఎలాంటి  ఫలితాన్ని రాబడతాడో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa