ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రవితేజ మళ్లీ కిక్ అందిస్తాడా ?

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 17, 2020, 11:07 AM

ప్రస్తుతం రవితేజ వరుస సినిమాలను అంగీకరిస్తున్నాడు. ఇప్పటికే రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ రాసిన కథతో, ‘నేను లోకల్’ ఫేమ్ నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో రవితేజ సినిమా చెయ్యటానికి ఒప్పుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఉంటుందని… సినిమాలో రవితేజ క్యారెక్టరైజేషన్ మంచి కామెడీ టైమింగ్ తో అద్భుతంగా ఉంటుందట. ముఖ్యంగా కిక్ సినిమాలో రవితేజను గుర్తుచెయ్యబోతున్నాడని.. సినిమాలో రవితేజ్ క్యారెక్టర్ చాలా కొత్తగా ఉండటంతో పాటు మంచి ఎమోషనల్ గా కూడా ఉంటుందని తెలుస్తోంది. ఇక త్రినాథరావ్ నక్కిన గత చిత్రాలు కూడా ‘సినిమా చూపిస్తా మామ’ ‘నేను లోకల్ వంటి సినిమాలు మంచి ఎంటెర్టైమెంట్ తో సాగాయి. ఈ సినిమా కూడా అలాగే సాగుతుందట. పైగా రవితేజ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం తన మాడ్యులేషన్ తోనే అద్భుతమైన కామెడీని పండించగలడు. కిక్ తరువాత రవితేజ మళ్లీ ఆ రేంజ్ కామెడీ సినిమా చెయ్యలేదు. మొత్తానికి ఈ సినిమాతో రవితేజ ఈ సారి ప్రేక్షకులను ఫుల్ గా నవ్వించడం ఖాయంలా కనిపిస్తుంది. పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. అన్నట్టు రవితేజ క్రాక్ మూవీతో పాటు రమేష్ వర్మ డైరక్షన్ లోనూ ఓ సినిమా చేస్తున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa