హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లు మన ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. రెండు సినిమాలు హిట్టైతే కోటి కావలని కొండెక్కి కూర్చునే ముద్దుగుమ్మలు కూడా ఉన్నారు. అనుష్క లాంటి వాళ్లైతే ఇప్పటికీ సినిమాకు 3 నుంచి 5 కోట్ల వరకు తీసుకుంటున్నారు. కాజల్ ఇప్పటికీ ముక్కుపిండి మరీ 2 కోట్లకు పైగానే వసూలు చేస్తుంది. పూజా హెగ్డే రేంజ్ కూడా 3 కోట్ల వరకు చేరిపోయింది. రష్మిక మందన్న, సమంత అక్కినేని ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది హీరోయిన్లు సినిమా సినిమాకు కోట్లు వెనకేసుకుంటున్నారు. నయనతార 20 లక్షలు.. తమన్నా 3 లక్షలు.. కాజల్ 2 లక్షలు విరాళంగా అందించారు.ఇంత చేసేది జనాల సొమ్ముతోనే కదా.. మరి వాళ్లకు కష్టమొచ్చినపుడు బ్యాంకుల్లోంచి తీయడానికి మనసు రావడం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. హీరోలను చూసైనా వీళ్లకు సాయం చేయాలనే మనసు రావడం లేదా.. పైగా ఒక్కొక్కరు మూడు నాలుగు భాషల్లో సంపాదిస్తుంటారు.. కోట్లకు కోట్లు కూడబెట్టి బిజినెస్ చేస్తుంటారు.. కానీ జనాలకు కష్టమొస్తే మాత్రం కనీసం ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదంటూ వాళ్లను విమర్శిస్తున్నారు. కరోనా బారిన పడి ప్రజలు చచ్చిపోతున్నారు.. ఆకలితో అలమటిస్తున్నారు.. ఇంత చేస్తుంటే హాయిగా వాళ్లు మాత్రం ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నారా అంటూ విమర్శలు వస్తున్నాయి.ఇలాంటి వాళ్లనా మనం దేవకన్యలు.. పైనుంచి దిగొచ్చారు అంటూ ఓ నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నాం అంటూ ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. వాళ్లకు బాధ్యత లేదా.. జనం సొమ్మునే కదా పారితోషికంగా తీసుకుంటున్నారు.. పైగా ప్రతీ ఖర్చును కూడా నిర్మాతలతోనే పెట్టిస్తుంటారు.. అలాంటప్పుడు జనానికి కావాల్సినపుడు ముందుకొచ్చి సాయం చేయకపోతే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు విశ్లేషకులు కూడా. చిన్న హీరోయిన్లను పక్కనబెట్టొచ్చు.. కనీసం స్టార్ హీరోయిన్లు కూడా ఏం మాట్లాడకపోవడం నిజంగానే విడ్డూరంగా ఉంది. ఇదే విషయంపై చిరంజీవి కూడా అసంతృప్తిగా ఉన్నాడని ప్రచారం జరుగుతుంది. వాళ్లకు ఫోన్ కూడా చేసి మాట్లాడుతున్నాడని తెలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa