నటుడు ఎన్టీఆర్ 30వ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రానికి దర్శకుడు త్రివిక్రమ్. ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్స్ కి అవకాశం ఉంది. అందులో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్, శృతి హాసన్‌ని ఎంపిక చేసినట్టు సమాచారం. గతంలో ఎన్టీఆర్, శ్రుతి హాసన్ కాంబినేషన్‌లో రామయ్యా వస్తావయ్యా అనే చిత్రం తెరకెక్కగా ఈ సినిమా అంతగా ఆదరణ పొందలేదు. ఎన్టీఆర్ 30వ చిత్రంలో కొంత పొలిటికల్ టచ్ ఉండనుందని టాక్. నవంబర్ నుండి స్టార్ట్ చేసి వచ్చే ఏడాది సమ్మర్ టార్గెట్ గా జూన్ ఫస్ట్ వీక్ లో విడుదలకు చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa