ఇతర రంగాలతో పోల్చితే సినీ ఇండస్ట్రీలో కాంబినేషన్లు అంటే తెలియని ఆసక్తి. పలానా హీరోహీరోయిన్లు జోడి కడితే భలే ఉంటుందని, సక్సెస్ ఖాయమని అభిమానులతో పాటు దర్శకనిర్మాతలు, టీమ్ భావిస్తోంది. కొన్నిసార్లు తమకు టైమ్ అచ్చిరాని సమయంలో క్రేజీ కాంబినేషన్‌లతో హిట్ ఖాయమని మరోసారి ట్రై చేస్తారు రాజ్ తరుణ్, అవికా గోర్ జంటగా కొంతకాలం క్రితం వచ్చిన 'ఉయ్యాలా జంపాలా' సినిమా భారీ విజయాన్ని సాధించింది. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ ప్రేమకథకు యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ఇద్దరి కెరియర్ కి ఈ సినిమా మంచి హెల్ప్ అయింది. ఆ తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'సినిమా చూపిస్త మావ' కూడా బాక్సాఫిస్ దగ్గర భారీ వసూళ్లనే రాబట్టింది.ఆ తరువాత ఎవరి సినిమాలు వారు చేసుకుంటూ వెళుతున్నారు. రాజ్ తరుణ్ కి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఇక అవికా గోర్ కొన్ని కారణాల వలన గ్యాప్ తీసుకుంది. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా రూపొందనున్నట్టు తెలుస్తోంది. గతంలో రాజ్ తరుణ్ హీరోగా 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు'ను తెరకెక్కించిన శ్రీనివాస్ గవిరెడ్డి, ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నట్టు చెబుతున్నారు. ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa