నిజానికి ఒక సినిమా హిట్ అయిందంటే ఇక ఆ డైరెక్టర్ చుట్టూ అవకాశాలు క్యూ కడతాయి. ఎందుకో అజయ్ విషయంలో ఇలా జరగలేదు. మొదట రామ్ తో ఆ తరువాత యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో అనుకున్నా సెట్ కాలేదు. ఇక రవితేజతో ఫిక్స్ అనుకున్నారు. అది క్యాన్సిల్ అయింది. ఆ తరువాత సమంత – నాగచైతన్య జంటగా కాప్ డ్రామా నేపథ్యంలో ఓ సినిమా రాబోతుందని వార్తలు వచ్చాయి, అదీ లేదని తేలిపోయింది.ప్రస్తుతానికి శర్వానంద్ హీరో అలాగే మరో హీరో కోసం కూడా చూస్తున్నారు…సినిమా టైటిల్ మహా సముద్రం అని వార్తలు వస్తున్నాయి. లాక్ డౌన్ తరువాత అధికారికంగా ఈ సినిమాని ప్రకటించబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఇదన్నా నిజం అవుతుందేమో చూడాలి. “ఆర్ఎక్స్ 100” లాంటి సెన్సేషనల్ హిట్ సాధించినా.. అజయ్ భూపతికి సినిమా కష్టాలు మాత్రం తప్పట్లేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa