వంశీ పైడిపల్లి, ఎన్టీఆర్ తో 'బృందావనం' సీక్వెల్ చేయాలనే నిర్ణయానికి వచ్చాడని అంటున్నారు.ఎన్టీఆర్ .. సమంత .. కాజల్ ప్రధాన పాత్రధారులుగా వంశీ పైడిపల్లి చేసిన 'బృందావనం' 2010లో భారీ విజయాన్ని సాధించిన చిత్రంగా నిలిచింది. ఆ సినిమా సీక్వెల్ కి సంబంధించిన కథను వంశీ పైడిపల్లి సిద్ధం చేయడం కూడా జరిగిపోయిందని చెబుతున్నారు. త్వరలోనే ఆయన ఎన్టీఆర్ కి ఆ కథను వినిపించనున్నట్టు తెలుస్తోంది. త్రివిక్రమ్ సినిమా తరువాత వంశీ పైడిపల్లితో ఎన్టీఆర్ సెట్స్ పైకి వెళతాడేమో చూడాలి మరి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa