ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిరంజీవి పై సంచలన వ్యాఖ్యలు చేసిన చక్రవర్తి

cinema |  Suryaa Desk  | Published : Mon, May 04, 2020, 04:55 PM

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో రికార్డులను తిరగరాసి మెగాస్టార్ అనిపించుకున్నాడు చిరంజీవి. హీరోగా ఎన్నో రికార్డులను సెట్ చేసిన చిరంజీవి.. ఆయన రిజెక్ట్ చేసిన సినిమాల విషయంలో కూడా ఒక రికార్డు క్రియేట్ చేశాడు. చిరంజీవిని పట్టుకుని మెగాస్టార్ కాదని అనేంత ధైర్యం ఎవరికి ఉందబ్బా అనుకుంటున్నారా..? ఇప్పుడు సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి రాసిన ఓ లేఖ వైరల్ అవుతుంది. అందులో చిరంజీవి గురించి సంచలన విషయాలు వెల్లడించాడు చక్రవర్తి. ముఖ్యంగా తాను అనుచరుడిని మాత్రం కాదని.. అభిమానిని మాత్రమే అని చెప్పుకొచ్చాడు చక్రవర్తి. ఈ మధ్యే కరోనా వల్ల నష్టపోయిన సినీ కార్మికుల ఆకలి తీర్చడానికి కరోనా క్రైసిస్‌ ఛారిటీని (సీసీసీ) ఏర్పాటు చేసాడు చిరంజీవి. దీనిపై అందరూ ఆయనకు సాయం చేస్తున్నారు. ఎవరికి తోచిన విరాళం వాళ్లు అందిస్తున్నారు. దీనిపై ఇప్పుడు జేడీ చక్రవర్తి ధన్యవాదాలు చెబుతూ చిరంజీవికి లేఖ రాసాడు.'ప్రియమైన చిరంజీవి.. నేను మీ అభిమానినే కానీ అనుచరుడిని కాను. ఎప్పట్నుంచో మిమ్మల్ని నేను నటుడిగా మాత్రమే ఇష్టపడేవాడ్ని.. ఒకప్పుడు నా తోటి నటులంతా సాయంత్రం అయ్యే సరికి మీ దగ్గరికి వచ్చి సమయం గడపడానికి ఆసక్తి చూపించే వాళ్లు.. కానీ నేనెప్పుడూ మీ దగ్గరికి రాలేదు.. రావాలనే ఆలోచన కూడా రాలేదు. ఇది నేను మీకు బహిరంగంగా రాస్తున్న లేఖ.. కరోనా వైరస్ తీసుకొచ్చిన నష్టం మాటల్లో చెప్పలేం.. లాక్‌డౌన్ చేయడంతో సినిమా పరిశ్రమ కూడా ఎంతో కోల్పోయింది. మాటల్లో చెప్పలేనంతగా సినీ కార్మికులు నష్టపోయారు.అందులో నాతో పాటు మీరు కూడా ఉన్నారు.. మనం కూడా ఎంతో కొంత కోల్పోయాం.. ఈ ఆపత్కాలంలో ఇతరుల్ని ఆదుకోవడానికి మీరు ముందుకు రావడం అద్భుతం. అభిమానులే కాదు.. అందరూ మిమ్మల్ని ఎందుకు అంతగా ఇష్టపడతారో.. నమ్ముతారనే దానికి మీరు ఇప్పుడు చేస్తున్న కరోనా క్రైసిస్ ఛారిటీ నిదర్శనం. మీరు నా దృష్టిలో మెగాస్టార్ కాదు.. అంతకంటే ఎక్కువ.. ఓ గొప్ప వ్యక్తిగా మిమ్మల్ని అభివర్ణించాలి. కొన్ని రోజుల క్రితం కొందరు సినీ కార్మికులు నాకు ఫోన్ చేశారు. ఈ సమయంలో చిరంజీవి గారు లేకపోయుంటే నిజంగానే ఆకలితో చచ్చిపోయేవాళ్లం అని.. తమ కుటుంబాలకు ఇప్పుడు ఎలాంటి ఆకలి సమస్యలు లేవని.. అదంతా చిరంజీవి చలువే అని.. ఆయన తమకు అవసరమైన నిత్యావసర వస్తువులను అందించారని తెలిపారు.మీకు అన్నం పెట్టిన చిత్ర పరిశ్రమకు ఇప్పుడు మీరు ఇలా రుణం తీర్చుకుంటున్నానని వాళ్లు నాతో చెప్పారు.. కానీ కార్మికుల పట్ల అది మీకున్న గౌరవం అని నేను భావిస్తున్నా. పది మందికి సాయం చేయాలనుకునే గుణం అద్భుతం.. చాలా మందికి హృదయం ఉంటుంది.. కానీ అది సరైన స్థానంలో లేక సాయం చేసే మనసు ఉండదు.. అందులో నేను కూడా ఉన్నాను. ఇప్పుడు నేను మెగాస్టార్‌ని మరింత అభిమానిస్తున్నా. నలుగురి ఆనందం కోరుకునే మీ వ్యక్తిత్వం గొప్పది. నేనెప్పటికీ మీ అభిమానిని.. ఇకపై అనుచరుడిని కూడా.. మిమ్మల్ని అమితంగా ఇష్టపడుతున్నా, ప్రేమిస్తున్నా. లాక్‌డౌన్ లేకపోతే ఇప్పటికిప్పుడు మిమ్మల్ని కలవడానికి వచ్చేవాడ్ని. ఓ మంచి వ్యక్తిగా ఎలా మారాలనే విషయాన్ని మీ దగ్గర నేర్చుకోవాలి' అని జేడీ లెటర్ రాసాడు. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa