ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిన్న హీరోయిన్ గొప్ప మనసు..కడుపు నింపుతున్న ప్రణీత

cinema |  Suryaa Desk  | Published : Mon, May 04, 2020, 06:23 PM

ప్రపంచ వ్యాప్తంగా కరోనా సృష్టించిన ప్రళయం అంతా ఇంతా కాదు. కరోనా వైరస్ దెబ్బకు అంతా రోడ్లపైకి వచ్చి పడ్డారు. కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఎందరో అభాగ్యులుగా మారిపోయారు. వలస కూలీలు..నిరుపేదలు అయితే తినడానికి తిండి లేక నానా కష్టాలు పడుతున్నారు. ఇలాంటి విపత్కర సమయాల్లో ఎందరో దాతలు వచ్చి తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. అలాంటి వారిలో హీరోయిన్ ప్రణీత ఒకరు. తెలుగు ప్రేక్షకులకు అత్యంత చేరువైన ప్రణీత తనకు ఉన్న దాంట్లో నిరుపేదలకు భోజనం...నిత్యావసర సరుకులు పంచుతూ తన పెద్దమనసు చాటుకుంటున్నారు. చిన్న హీరోయిన్ అయినప్పటికీ పెద్ద హీరోయిన్లు ఆదర్శంగా తీసుకునే పనులు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.బావ, అత్తారింటికి దారేది, బ్రహ్మోత్సవం, రభస, డైనమైట్, పాండవులు పాండవులు తుమ్మెద, హలో గురు ప్రేమ కోసమే, ఎన్టీఆర్ కథానాయకుడు మెుదలగు చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తన ఉదారతను చాటుకుంటుంది. కరోనా విపత్తు సమయంలో సాటి మనిషికి సాయం చేస్తూ అందరి మన్నలను పొందుతుంది. కరోనా కారణంగా పనుల్లేక, చేతిలో చిల్లిగవ్వలేక ఆకలితో అలమటిస్తున్న పేద వాళ్ళ కడుపు నింపేందుకు ప్రణీత స్వయంగా రంగంలోకి దిగింది. కర్ణాటకలో ఆకలితో అలమటిస్తున్న వారి కోసం తానే స్వయంగా వంట చేసి, ఆ వంటకాలను ప్యాకెట్ల రూపంలో పేదవారికి చేరవేస్తోంది. లాక్‌డౌన్ మొదలైన తర్వాత నుంచి నిత్యం వేల సంఖ్యలో ఆహారం సరఫరా చేస్తూ ఎందరో కడుపు నింపుతోంది.తాను వంట చేస్తున్న ఫోటోలు.. ప్యాకింగ్ చేస్తున్న ఫోటోలు...నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతేకాదు తనతోపాటు పనిచేసే సినీ కార్మికులకు కూడా ఆమె సహాయం చేసింది. సినీ రంగంలో పనిచేసే యాభై కుటుంబాల సహాయార్ధం లక్ష రూపాయల విరాళం అందించారు ప్రణీత. ఆ తర్వాత తనను ఆదరించే ప్రేక్షకుల కోసం ఆలోచించి ఇలా భోజనం..నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ తన గొప్పమనసు చాటుకుంది. ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాలను చూస్తున్న అశేష ప్రేక్షక లోకం పొగడ్తలతో ముంచెత్తుతుంది.అంతేకాదు ఆమెను ఆధారంగా చేసుకుని కోట్లాది రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటులపై సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. ఏది ఏమైనప్పటికీ సినిమాల్లో మంచి వ్యక్తిగా నటించడమే కాదు బయటకు కూడా మంచి మనసున్న మనిషిగా నిరూపించుకుంటున్నారు ప్రణీత. రీల్ లైఫ్ లో కాదు రియల్ లైఫ్ లో కూడా తన ఉదారతను చాటుకుని అందరికి మరింత దగ్గరయ్యారు హీరోయిన్ ప్రణీత. ఆమె చేసిన సహాయానికి ప్రతీ ఒక్కరూ ఆమెను దేవత అంటూ పొగడ్తలతో ముంచెత్తడమే కాదు చల్లగా ఉండాలంటూ దీవిస్తున్నారట. ఇంతటి గొప్ప మనసున్న ప్రణీతను అందరూ అభినందించి తీరాల్సిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa