ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫేక్ న్యూస్ లపై విజయ్ దేవరకొండ ఫైర్

cinema |  Suryaa Desk  | Published : Tue, May 05, 2020, 09:12 AM

రౌడీ హీరో విజయ్ దేవరకొండ దూకుడు గురుంచి చెప్పక్కర్లేదు, సినిమాల విషయంలోను, ప్రమోషన్ ల విషయంలోను అందరికంటే డిఫరెంట్ గా ఉండే విజయ్ దేవరకొండ, చారిటీ విషయంలోనూ కొత్త పంథాను ఎంచుకున్నాడు. కరోనా కారణంగా పేదలకు ఆదుకోవడానికి సెలబ్రటీలందరూ వివిధ స్వచ్ఛంద సంస్థలకు డొనేషన్లు చేస్తే విజయ్ దేవరకొండ మాత్రం తనే ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి, ఒక వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి ఒక వ్యవస్థ ద్వారా పేదలకు సహాయం చేస్తున్నాడు. వెబ్ సైట్ లో సహాయం నమోదు చేసుకున్న వారికి ఫోన్ చేసి, వెరిఫై చేసి సహాయం అందిస్తున్నారు . ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ రూ.25 లక్షలు డొనేట్ చేయగా, అతని పిలుపు ద్వారా దాదాపు 4 వేల మంది ఫౌండేషన్ కు డొనేట్ చేశారు. ఐతే విజయ్ దేవరకొండ చేస్తున్న చారిటీపై కొన్ని వెబ్ సైట్ లలో తప్పుగా వార్తలు రావడంతో వారిపై విజయ్ దేవరకొండ ఫైర్ అయ్యారు. ఇప్పటికి వరకు 7 వేలకు పైగా కుటుంబాలకు సహాయం చేశామని, చేస్తున్న మంచిని చెడుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని, తప్పుడు వార్తలు పెట్టడం మంచిది కాదని వీడియో ద్వారా హెచ్చరించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ వీడియో వైరల్ మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa