కాజల్ జోరు తగ్గుతుందని అనిపించినప్పుడే ఆమెకి 'ఖైదీ నెంబర్ 150' సినిమాలో అవకాశం దక్కింది. ఆ తరువాత 'భారతీయుడు 2' సినిమాలోను అవకాశాన్ని దక్కించుకుంది. తాజాగా ఆమె ఉదయనిధి స్టాలిన్ సినిమాలోను ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాకి గాను ఆమె భారీ పారితోషికాన్ని అందుకుంటున్నట్టు తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే ఆమె మరోసారి విజయ్ జోడీగా ఛాన్స్ ను దక్కించుకున్నట్టు చెబుతున్నారు. గతంలో విజయ్ సరసన కాజల్ 'తుపాకి' సినిమా చేసింది. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 2012 లో వచ్చిన ఆ సినిమా విజయ్ కెరియర్లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది.అలాంటి ఆ సినిమాకి సీక్వెల్ చేయడానికి మురుగదాస్ రంగంలోకి దిగినట్టుగా సమాచారం. గతంలో కాజల్ చేసిన పాత్రకి కొనసాగింపుగా ఆమెనే తీసుకున్నట్టుగా తెలుస్తోంది. లాక్ డౌన్ తరువాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానున్నట్టు చెబుతున్నారు. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. సీక్వెల్ తోను ఈ కాంబినేషన్ హిట్ కొడుతుందేమో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa