ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్...

cinema |  Suryaa Desk  | Published : Wed, May 06, 2020, 04:33 PM

ప్రస్తుతం ప్రశాంత్ నీల్ 'కేజీఎఫ్ 2' సినిమా పనులతో బిజీగా వున్నాడు. తన తదుపరి సినిమాను ఆయన ప్రభాస్ తో చేయాలనుకున్నాడు. ఇద్దరి మధ్య చర్చలు కూడా జరిగాయని అన్నారు. అయితే ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమా పూర్తికావడానికి ఇంకా సమయం పడుతుంది. ఆ తరువాత ఆయన నాగ్ అశ్విన్  తో చేయనున్న సినిమా కూడా చాలా సమయం తీసుకోనుంది.ఈ లోగా ఎన్టీఆర్ తో  చేయాలనే ఉద్దేశంతో ప్రశాంత్ నీల్ వున్నాడట. ఆల్రెడీ ఆయన ఎన్టీఆర్ ను కలవడం .. తన దగ్గరున్న లైన్ వినిపించడం జరిగిపోయాయని అంటున్నారు. త్రివిక్రమ్ సినిమా తరువాత ఎన్టీఆర్ చేయనున్న  సినిమా ఇదేనని అంటున్నారు. వైవిధ్యభరితమైన కథాకథనాలతో ఈ సినిమా రూపొందుతుందని చెబుతున్నారు.  ఈ సినిమా తరువాత కొరటాలకి డేట్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ ఉన్నాడని అంటున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ కెరియర్ పరంగా పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళుతున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa