ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దర్శకుడు వివేక్ ఆత్రేయ సినిమాలో నాని!

cinema |  Suryaa Desk  | Published : Wed, May 06, 2020, 04:36 PM

దర్శకుడు వివేక్ ఆత్రేయకి కూడా నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇంతకుముందు 'బ్రోచేవారెవరురా' సినిమాతో వివేక్ ఆత్రేయ దర్శకుడిగా తన సత్తా చాటుకున్నాడు.  ఆయన వినిపించిన కథ నచ్చడంతో వెంటనే నాని ఓకే చెప్పేశాడట.  'బ్రోచేవారెవరురా' తరహాలోనే ఈ సినిమా పూర్తి వినోదభరితంగా సాగుతుందని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం కథానాయికను ఎంపిక చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక వైపున 'శ్యామ్  సింగ రాయ్' చేస్తూనే మరో వైపున వివేక్ ఆత్రేయ సినిమాను నాని చేయనున్నాడని చెబుతున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa