సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్బంగా మహేశ్ బాబు 27వ సినిమా లాంచ్ చేయాలని భావించారు.అయితే ఆ రోజున ఈ సినిమా టైటిల్ ను రివీల్ చేయడమే కాకుండా, మహేశ్ బాబు ఫస్టులుక్ పోస్టర్ ను కూడా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారనేది తాజా సమాచారం. ఈ సినిమాలో కథానాయిక అంటూ ఇద్దరు ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి. ఆ కథానాయికల్లో ఒకరిని త్వరలోనే ఎంపిక చేయనున్నట్టు తెలుస్తోంది. 'గీత గోవిందం'తో హిట్ కొట్టిన పరశురామ్ చేస్తున్న సినిమా కావడంతో, సహజంగానే ఈ ప్రాజెక్టుపై అంచనాలు పెరిగిపోతున్నాయి. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాతో, మహేశ్ బాబుకి మరో భారీ హిట్ పడటం ఖాయమనే అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa