ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాగ్ అశ్విన్, ప్రభాస్ సినిమాలో అరవింద్ స్వామి!

cinema |  Suryaa Desk  | Published : Wed, May 06, 2020, 04:47 PM

రాధాకృష్ణ సినిమా తర్వాత ప్రభాస్.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఇప్పటి వరకు తెలుగు తెరపై రాని సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను ప్యాన్ ఇండియా కాకుండా ప్యాన్ వరల్డ్ రేంజ్‌లో ఉంటుందని నాగ్ అశ్విన్ చెప్పాడు. ఈ సినిమా కోసం ప్రభాస్.. ఏకంగా రూ.70 కోట్ల వరకు ఛార్జ్ చేసినట్టు తెలుస్తుంది. సోషియో ఫాంటసీని టచ్ చేస్తూ ఈ కథ నడుస్తుంది. వైజయంతీ మూవీస్  బ్యానర్ పై భారీ తారాగణంతో ఈ సినిమాను నిర్మించనున్నారు. వివిధ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచన ఉండటంతో, బాలీవుడ్ హీరోయిన్స్ ను ఎంపిక చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.ఈ సినిమాలో ప్రతినాయకుడిగా ఎవరిని తీసుకోనున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే అరవింద్ స్వామి పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల  కాలంలో స్టైలీష్ విలన్ పాత్రలకు అరవింద్ స్వామి కేరాఫ్ అడ్రెస్ గా మారాడు. ప్రభాస్ సినిమా కోసం ఫోన్ లోనే అరవింద్ స్వామిని సంప్రదించినట్టు తెలుస్తోంది.భారీ ప్రాజెక్టు కావడం .. తను ఎంతగానో ఇష్టపడే స్టైలీష్ విలన్ పాత్ర కావడం వలన అరవింద్ స్వామి అంగీకరించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అంటున్నారు. డిసెంబర్లో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa