ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పుష్ప లో ఆ సీన్ కోసం 6 కోట్ల ఖర్చు...

cinema |  Suryaa Desk  | Published : Wed, May 06, 2020, 04:51 PM

పుష్ప ఫస్ట్‌లుక్‌తో సినిమా అంచనాలు పెంచేశారు దర్శకుడు సుకుమార్. రంగస్థలం సినిమాలో రామ్ చరణ్‌ను ఎలాగైతే పూర్తిగా మార్చేసి చిట్టిబాబుగా సరికొత్త రూపం తీసుకుని వచ్చారో.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌‌ని ఎవరూ ఊహించన విధంగా ఫస్ట్‌లుక్‌లో చూపించారు.పెరిగిన జుట్టు, మాసిన గెడ్డం-మీసాలతో అల్లు అర్జున్‌ని రగ్డ్ లుక్‌లో చూపించి మెస్మరైజ్ చేశారు. ఎప్పుడో 1980 నాటి బ్యాక్ డ్రాప్ కథలా పాత రకం స్టైల్‌లో అల్లు అర్జున్‌ని మొరటు లారీ డ్రైవర్‌గా చూపించారు.రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా, ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగనుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పాత్రను పోషిస్తున్నాడు. పూర్తి మాస్ లుక్ తో ఆయన ఈ సినిమాలో కనిపించనున్నాడు.ఈ సినిమాలో అడవి నేపథ్యంలో ఛేజింగ్ తో కూడిన ఒక యాక్షన్ సీన్ ను ప్లాన్ చేశారట. తెరపై ఈ ఫైట్ సీన్ 6 నిమిషాల పాటు వుంటుందట. ఈ 6 నిమిషాలకి గాను 6 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్టు తెలుస్తోంది. దీనిని బట్టి ఈ యాక్షన్ సీన్ ను ఏ రేంజ్ లో చిత్రీకరిస్తున్నది అర్థం చేసుకోవచ్చు.ఇక ఫైట్స్ విషయంలోనే కాదు .. డాన్సుల విషయంలోను సుకుమార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడట. ఇంతవరకూ బన్నీ వేసిన స్టెప్స్  కాకుండా ఆయన స్టెప్స్ కొత్తగా ఉండేలా డిజైన్ చేయిస్తున్నాడట. ఈ డాన్సులు ఆయన అభిమానులను  ఎంతగానో ఆకట్టుకుంటాయని చెబుతున్నారు.  దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి  ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు. లాక్ డౌన్ తరువాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa