ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలయ్య ఆ పాత్రలో ఖచ్చితత్వం సాధించడం కోసం ఆయన ఇలా చేస్తున్నారట...

cinema |  Suryaa Desk  | Published : Fri, May 08, 2020, 09:51 AM

బాలయ్య-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీపై ఆయన ఫ్యాన్స్ లో విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. బాలయ్య హిట్ కొట్టి చాలా రోజులు అవుతున్న తరుణంలో ఈ సినిమా ఫ్యాన్స్ దాహం తీరుస్తుందని వారు భావిస్తున్నారు. మిర్యాల రవీంద్రా రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నందమూరి నటసింహం బాలకృష్ణ నెక్స్ట్ మూవీలో సరికొత్త అవతారంలో దర్శనం ఇవ్వనున్నారు. ఆయన బోయపాటి దర్శకత్వంలో చేస్తున్న మూవీలో ఓ పాత్రలో అఘోరాగా కనిపించనున్నాడు. ఈ విషయాన్ని దర్శకుడు బోయపాటి కూడా ధ్రువీకరించడం జరిగింది. కాగా ఈ పాత్ర కోసం బాలకృష్ణ అధ్యయనం చేస్తున్నారట. నిజమైన అఘోరాల బాడీ లాంగ్వేజ్, ప్రవర్తన వంటి అనేక విషయాలు వీడియోలు , పుస్తకాల ద్వారా తెలుసుకుంటున్నాడట. ఆ పాత్రలో ఖచ్చితత్వం సాధించడం కోసం ఆయన ఇలా చేస్తున్నారట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa