గీతాంజలి కావ్యాన్ని, జాతీయ గీతాన్ని రచించిన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటు అదే భావాలతో ఒక వ్యవస్థని కథగా రాసుకొని తెరకెక్కిస్తున్న చిత్రం దాడి. ఈ సందర్భంగా దర్శకుడు మధు శోభ.టి మాట్లాడుతూ… సమాజంలో జరుగుతున్న కొన్ని వాస్తవ సంఘటనలు ఆధారంగా దాడి చిత్రాన్ని రూపొందించడం జరిగింది. రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చెయ్యడం సంతోషంగా ఉంది. నిర్మాత శంకర్.ఏ గారు ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా బాగా వస్తోంది, త్వరలో ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు తెలియజేస్తామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa