ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'క్రాక్' సినిమాలో ఆ ఒక సీన్ మిగిలిపోయింది

cinema |  Suryaa Desk  | Published : Tue, May 12, 2020, 04:29 PM

లాక్ డౌన్ ను ప్రకటించడంతో  'క్రాక్'  సినిమా షూటింగు ఆగిపోయింది.  లాక్ డౌన్ ఎత్తేయగానే  ఈ ఒక్క సీన్ ను చిత్రీకరించుకుని వస్తారట.శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను, ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్యలో విడుదల చేయాలని భావిస్తున్నారట. గతంలో రవితేజ - శ్రుతిహాసన్ జంటగా నటించిన 'బలుపు' విజయాన్ని సాధించింది. అందువలన ఈ కాంబినేషన్ పై అందరిలో ఆసక్తి తలెత్తుతోంది. ఇక చాలా గ్యాప్ తరువాత శ్రుతి హాసన్ తెలుగులో చేస్తున్న సినిమా ఇది. అందువలన ఆమె అభిమానులంతా ఈ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతకుముందు రవితేజ .. గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వచ్చిన సినిమాలు కూడా విజయాలను అందుకోవడం కూడా ఈ సినిమాపై అంచనాలు పెంచుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa