ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తమిళనాడు సర్కార్ పై సంచనల వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ కస్తూరి

cinema |  Suryaa Desk  | Published : Tue, May 12, 2020, 04:36 PM

కస్తూరి తాజాగా తమిళనాడు ప్రభుత్వంపై విరుచుకుపడింది అవతలి వాళ్లు ఎంతటి వారైనా తనదైన శైలిలో విరుచుకుపడే హీరోయిన్లలో కస్తూరి ఒకరు. కమల్ హాసన్, రజనీకాంత్ వంటి హీరోలను సైతం విమర్శించడానికి వెనకాడని ఈ భామ.. తమిళనాడు ప్రభుత్వం మద్యం అమ్మకాల కోసం దుకాణాలు తెరవాలన్న నిర్ణయంపై విరుచుకుపడింది. ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఆలయాలు మూసివేసి.. మద్యం దుకాణాలు తెరవాలన్న ఆలోచనలో లాజిక్ ఏంటో తెలియడం లేదంటూ వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఈమె చేసిన వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది.ఈమె అప్పట్టో కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ’అన్నమయ్య’ సినిమాలో కథానాయికగా నటించింది.  టాలీవుడ్ మన్మథుడిగా ముద్రపడిన నాగార్జున... శ్రీవెంకటేశ్వరుడి భక్తుడు అన్నమయ్యగా అద్భుతంగా నటించి, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమాలో రమ్యకృష్ణతో పాటు మరో హీరోయిన్‌గా నటించింది కస్తూరి. అంతకుముందు నందమూరి బాలకృష్ణతో ‘నిప్పురవ్వ’ సినిమాలో బాలయ్య సోదరి పాత్రలో నటించింది. ఆ తర్వాత మోహన్‌బాబుతో ‘సోగ్గాడి పెళ్లాం’ వంటి సినిమాలో కనిపించింది. ఆ తర్వాత భారతీయుడులో కమల్ హాసన్ కూతురు పాత్రలో నటిచింది. రవితేజ హీరోగా నటిచింన డాన్ శీనులో కూడా హీరో చెల్లెలు పాత్రలో నటించింది. అందాలతో అల్లరి చేసిన కస్తూరి... ఇప్పటికీ తమిళ్‌లో ఆడపా దడపా సినిమాల్లో నటిస్తూ కెరీర్ కొనసాగిస్తోంది.  ఆ మధ్య తమిళంలో కమల్ హాసన్ హోస్ట్ చేసిన బిగ్‌బాస్ నటించి మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చింది. ప్రస్తుతం తెలుగులో ‘గృహలక్ష్మీ’ సీరియల్‌లో నటించింది. కస్తూరి కాంట్రవర్సీలు కొత్త కాదు..  కొన్నాళ్ల కిందట ‘తలైవా’ అజిత్ ఫ్యాన్స్‌తో పెట్టుకుని, చిక్కులు ఎదుర్కొన్న కస్తూరి... ఆ తర్వాత ఎమ్‌జీఆర్, సీనియర్ హీరోయిన్ లత యాక్ట్ చేసిన సినిమాపై  వ్యాఖ్యలు చేసి వివాదాల్లో చిక్కుక్కుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa