కమెడియన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పులికొండ ప్రియదర్శి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మారాడు. విభిన్న పాత్రలు చేస్తూ నటుడిగా కూడా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. అందుకే ఇప్పుడు ఆయన్ను కమెడియన్ అనాలా? లేక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనాలా? అనే సందేహం చాలా మందిలో ఉంది. అయితే ఇదే విషయాన్ని ప్రియదర్శిని కూడా ఈ మధ్య చాలా మంది అడుతున్నారని అంటున్నాడు ప్రియదర్శి. ఇదే విషయాన్ని ఆయన తన తాజా ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.
నిజానికి చాలా హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీ యాక్టర్‌గా మారిన ప్రియదర్శి హీరోగా ‘మల్లేశం’ సినిమా చేశాడు. అయితే అలా అడిగిన వారందరికీ ఒకటే సమాధానం చెప్పుకొచ్చాడు. తనవరకు అన్ని రకాల పాత్రలు చేసి విభిన్నమైన నటుడిగా గుర్తింపు పొందాలని అనుకుంటున్నానని పేర్కొన్నారు. నిజానికి కామెడీ చేయడమే చాలా కష్టమన్న ఆయన విలన్ పాత్రలు చేయాలని ఉందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ‘లూజర్’ అనే వెబ్ సిరీస్‌లో చేసిన పాత్ర చాలా విభిన్నంగా ఉంటుంది. ఏ పాత్ర చేసినా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడమే లక్ష్యమని ఆయన చెప్పుకొచ్చాడు. లూజర్ అనే స్పోర్ట్ బేస్డ్ వెబ్ సిరీస్ చేశాడు. అన్నపూర్ణ స్టూడియోస్ వారు ఈ వెబ్ సిరీస్ ను నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa