''గబ్బర్ సింగ్'' తరువాత మళ్లీ ఇంతకాలానికి పవన్ తో మరో సినిమా చేయనున్నామని ఇటీవల హరీశ్ శంకర్ స్పష్టం చేశాడు. ఈ సినిమాలో పవన్ సరసన నాయికగా మానస రాధాకృష్ణన్ అనే మలయాళ ముద్దుగుమ్మను తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇప్పటికే మలయాళ సినిమాలతో బిజీ అవుతున్న ఈ సుందరి, పవన్ సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయం కానుందని చెప్పుకున్నారు.మలయాళ భామలు తెలుగు తెరపై తమ జోరు చూపుతున్న కారణంగా అంతా ఈ వార్త నిజమేనని అనుకున్నారు. అయితే, అందులో ఎంత మాత్రం నిజం లేదని హరీశ్ శంకర్ ట్వీట్ చేశారు. ఈ వార్త కేవలం పుకారు మాత్రమేనని చెప్పారు. తన సినిమాలకి సంబంధించిన వివరాలను తానే స్వయంగా తెలియజేస్తానని అన్నారు. ఈ పుకారు ఎక్కడ పురుడు పోసుకుందో తెలియదుగానీ, హరీశ్ శంకర్ దానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఇక ఇప్పుడు పవన్ సరసన కథానాయికగా ఛాన్స్ ఎవరికి దక్కుతుందోననేది ఆసక్తికరంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa