ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆయన నాకు నటన రాదు అన్నారు ఆదర్శ్ బాలకృష్ణ

cinema |  Suryaa Desk  | Published : Wed, May 13, 2020, 06:32 PM

"కృష్ణవంశీ దర్శకత్వంలో నేను 'గోవిందుడు అందరివాడేలే' సినిమా చేశాను. ఆయన దర్శకత్వంలో ఒక సినిమా చేసే అవకాశం రావడాన్ని ఆర్టిస్టులు అదృష్టంగా భావిస్తారు. అలాంటిది ఆయన సినిమాలో నటించినన్ని రోజులు నేను తిట్లు తింటూనే వచ్చాను.'నీకు నటన రాదు .. నువ్వెందుకు పనికి రావు' అంటూ ఆయన ఒక రేంజ్ లో తిట్టేవారు. ఆ మాటలు చాలా అవమానకరంగా అనిపించినప్పటికీ, చాలా సహనంతో భరిస్తూ వచ్చేవాడిని. నా నుంచి మంచి నటనను రాబట్టడం కోసమే ఆయన అలా అంటున్నారని భావించాను.  షూటింగు జరుగుతున్నప్పుడుగానీ .. ఆ తరువాతగాని ఆయనపై నాకు కోపం రాలేదు.  ఇప్పుడు ఆయనతో మంచి స్నేహం కుదిరింది. కలిసినప్పుడల్లా సరదాగా మాట్లాడుకుంటాము.  ఆయన నన్ను తిట్టిన తిట్లను నేను గుర్తుచేస్తుంటే, నాతో పాటు కలిసి ఆయన నవ్వుతుంటారు" అని చెప్పుకొచ్చాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa