ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మా ఇద్దరి మధ్య మంచి బంధం... సుధీర్ గురించి ఆసిక్తికరమైన వ్యాఖ్యలు చేసిన యాంకర్ రష్మి

cinema |  Suryaa Desk  | Published : Wed, May 13, 2020, 06:39 PM

తెలుగు బుల్లితెరపై కొన్ని జంటలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అందులో సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్ కూడా ఒకటి. వాళ్లిద్దరూ జంటగా కనిపిస్తే చాలు రేటింగ్స్ అద్భుతంగా ఉంటాయి. సుధీర్, రష్మి అంటేనే స్పెషల్ క్రేజ్ ఉంటుంది. వాళ్లిద్దరి మధ్య ఏదో నడుస్తుందని.. ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని.. పెళ్లి చేసుకుంటారని రోజుకో వార్త వస్తూనే ఉంటుంది. యూ ట్యబ్ జోడీ అంటూ ఈ ఇద్దరిపై ఎప్పుడూ వార్తలు వస్తూనే ఉంటాయి.  'జబర్దస్త్’ నటుడు ‘సుడిగాలి’ సుధీర్ కు, ప్రముఖ యాంకర్ రష్మికి మధ్య ఏదో ఉందంటూ వదంతులు వ్యాపించడం, వాటిని ఖండించడం రష్మి చేస్తూనే ఉంది. తాజాగా, ఇదే విషయమై ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు ఆమె మరోమారు స్పందించింది.సుధీర్ తో తనకు ఉన్న సంబంధం గురించి చెబుతూ, సుధీర్, తానూ నటీనటులం మాత్రమేనని, స్క్రిప్ట్ కి అనుగుణంగా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు తామిద్దరం కష్టపడి ఉత్తమమైన ప్రదర్శన కనబరుస్తుంటామని చెప్పింది. నిజజీవితంలో తామిద్దరం గొప్ప స్నేహితులం కూడా కాదని చెప్పిన రష్మిక, తమ మధ్య ఓ మంచి బంధం ఉంది తప్ప అంతకు మించి ఏమీ లేదని స్పష్టం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa