తాజా ఇంటర్వ్యూలో రాశి ఖన్నామాట్లాడుతూ .. "ఈ మధ్య కాలంలో నేను విభిన్నమైన పాత్రలకే ప్రాధాన్యతనిస్తున్నాను. ఆ పాత్రల్లో ప్రేక్షకులు నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటున్నారనేది గమనిస్తున్నాను. వాళ్ల నుంచి వస్తున్న రెస్పాన్స్ ను బట్టి, తరువాత ప్రాజెక్టులను ఒప్పుకుంటున్నాను. నాపై గాసిప్స్ రాకపోవడానికి కారణం ఏమిటని చాలామంది అడుగుతున్నారు. అందుకు అవకాశం ఇవ్వకపోవడమే కారణం. ఒకవేళ గాసిప్స్ వచ్చినా వాటిని నేను పెద్దగా పట్టించుకోను. ఎవరినీ పోటీగా భావించకుండా నా పనిని నేను చేసుకుపోతుంటాను. ఖాళీ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడపడానికి ఇష్టపడతాను. తెరపై నేను ఎలా కనిపించినప్పటికీ, బయట మాత్రం ఆధ్యాత్మికత .. బిడియం కలిగిన అమ్మాయిగానే వుంటాను. ఏ విషయంలోనైనా ఆర్భాటాలకు పోకుండా సింపుల్ గా ఉండటానికి నేను ఇష్టపడతాను" అని చెప్పుకొచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa