ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు ఉదయం హీరో నిఖిల్ పెళ్లి

cinema |  Suryaa Desk  | Published : Wed, May 13, 2020, 06:49 PM

నిఖిల్ వివాహం ఎప్పుడు జరుగుతుందోనని ఎదురుచూస్తున్న అభిమానులకు శుభవార్త.హిందూ సంప్రదాయపద్ధతిలో రేపు ఉదయం నిఖిల్-పల్లవిల వివాహం జరగనుంది. పెళ్లి ముహూర్తం 6.31 గంటలుగా నిర్ణయించినట్టు సమాచారం. హైదరాబాద్ శివార్లలోని నిఖిల్ ప్రైవేట్ విల్లాలో వీరి వివాహం జరగనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసుల అనుమతి లభించింది. లాక్ డౌన్ నిబంధనల నేపథ్యంలో వధూవరూల తరఫు నుంచి అతికొద్ది మంది బంధువులు మాత్రమే వీరి వివాహానికి హాజరుకానున్నారు. తమ వివాహానికి హాజరయ్యే వారు సామాజిక దూరం పాటించడం, మాస్క్ లు ధరించడం తప్పనిసరని నిఖిల్ ఇప్పటికే చెప్పినట్టు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa