ఇటీవల చరణ్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని చరణ్ పాత్రను పరిచయం చేస్తూ ఒక స్పెషల్ వీడియోను వదిలారు. ఆ వీడియోకు అనూహ్యమైన స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.ఇక త్వరలో ఎన్టీఆర్ కి సంబంధించిన వీడియో పలకరించనుంది. ఈ నెల 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 'ఆర్ ఆర్ ఆర్' లో ఆయన పాత్రను పరిచయం చేస్తూ ఒక స్పెషల్ వీడియోను వదలనున్నారు. ఇప్పటికే వీడియోను సిద్ధం చేశారట .. టీమ్ అంతా కూడా ఈ వీడియో పట్ల సంతృప్తికరంగా ఉందనే టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ అభిమానులు ఆశించిన స్థాయిలో ఈ వీడియో ఉంటుందని అంటున్నారు. ముందుగా చెప్పిన ప్రకారమే జనవరి 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa