సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ గతకొన్ని రోజులుగా తెలుగు సినిమాల్లో కనిపించట్లేదు. ఒకప్పుడు తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లో నటించిన సిమ్రాన్ టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరి సరసన నటించింది. అయితే తాజాగా మరోసారి సిమ్రాన్ తెలుగు సినిమాల్లో కనిపించనుంది. ఒకప్పటి సీనియర్ హీరోయిన్లందరూ నేటి హీరోలకి తల్లులుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో తెలుగులోనూ రీ ఎంట్రీ ఇస్తుందని అభిమానులు భావించారు. కానీ ఆమె తెలుగు సినిమాలకి మాత్రం దూరంగానే ఉండిపోయింది.ఇక్కడి స్టార్ హీరోలతో కలిసి తెరపై ఒక రేంజ్ లో సందడి చేసిన ఆమె, మళ్లీ ఈ వైపు రాకపోవడం అభిమానులను నిరాశపరిచింది. తెలుగులో చెప్పుకోదగిన పాత్రలు రాకపోవడం వల్లనే తాను చేయడం లేదని ఆమె కొన్ని ఇంటర్వ్యూల్లో చెబుతూ వచ్చింది. అలాంటి సిమ్రాన్ దాదాపు పుష్కరకాలం తరువాత తెలుగులో ఒక సినిమాకి చేయడానికి అంగీకరించినట్టు సమాచారం. రాజ్ తరుణ్ హీరోగా సంతోష్ మోహన్ దర్శకత్వంలో ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ రూపొందనుంది. లాక్ డౌన్ తరువాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం సిమ్రాన్ ను సంప్రదించడం .. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని అంటున్నారు. సిమ్రాన్ అభిమానులకు ఇది శుభవార్తేనని చెప్పాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa