ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హీరో రానా పెళ్లి పై సంచనల కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి

cinema |  Suryaa Desk  | Published : Thu, May 14, 2020, 05:28 PM

టాలీవుడ్ హీరోలలో ప్రస్తుతానికి ఉన్న బాచిలర్స్ ఎవరంటే మనకు టక్కున మదిలో మెదిలే పేర్లలో ప్రభాస్, రానా, త్వరలోనే పెళ్లిచేసుకోబోతున్నట్టు సినీ హీరో రానా ప్రకటించిన సంగతి తెలిసిందే. తన ప్రియురాలు మిహీకా బజాజ్ ను రానా పెళ్లాడబోతున్నాడు. పెళ్లి ఏర్పాట్ల ప్లానింగ్ లో ఉన్నట్టు రానా తండ్రి దగ్గుబాటి సురేశ్ బాబు కూడా వెల్లడించారు. రానా, మిహీకాలకు ఇంతకు ముందు నుంచే పరిచయం ఉందని చెప్పారు.మరోవైపు, బ్యాచిలర్ జీవితానికి ముగింపు పలుకుతున్న రానాకు సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వివాదాస్పద నటి, ఫైర్ బ్రాండ్ శ్రీరెడ్డి కూడా ఈ అంశంపై స్పందించింది. 'మీ జీవితంలో ఏం జరిగిందో నాకు తెలుసు రానా గారు. ఆ అమ్మాయితో మీకు ప్రశాంతమైన జీవితం ఉండేలా భగవంతుడు దీవిస్తాడు' అంటూ ఫేస్ బుక్ లో శ్రీరెడ్డి వ్యాఖ్యానించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa