తాజాగా నిన్న తన పుట్టినరోజు సందర్భంగా అనసూయ మంచి కార్యక్రమాలను చేపట్టారు. హైదరాబాద్ కీసర ప్రాంతంలో వంద మంది గర్భిణిలకు న్యూట్రిషన్స్ కిట్స్ అందించారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో అభిమానులతో లైవ్ లో మాట్లాడారు.ఈ లైవ్ లో ఒక కూల్ డ్రెస్ లో అనసూయ కనిపించింది. ఆమె మాట్లాడుతుండగా... ఒక నెటిజెన్ 'ఇద్దరు పిల్లల తల్లివి. ఆ డ్రస్ ఏంటి? పద్ధతిగా ఉండొచ్చు కదా?' అన్నాడు. దీంతో, సదరు నెటిజెన్ పై అనసూయ ఫైర్ అయ్యారు. 'నా డ్రెస్ గురించి మాట్లాడటానికి నువ్వెవడివిరా? అమ్మ అయితే ఏ డ్రెస్ వేసుకోవాలనే రూల్ ఏమైనా ఉందా? అమ్మతనం గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా? నా పుట్టినరోజు నాడు తిట్లు తినాలనుకుంటున్నావా?' అంటూ మండిపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa